ట్రంప్ మీద కోపం.. 77 ఏళ్ల భర్తకు విడాకులు
ఆమెకు 73 ఏళ్లు. భర్తకు 77 ఏళ్లు. ఇద్దరూ దాదాపు 20 ఏళ్లుగా కలిసుంటున్నారు. కానీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వడం ఆమెకు నచ్చలేదు. అంతే.. విడాకులు ఇచ్చి పారేసింది.
ఆమెకు 73 ఏళ్లు. భర్తకు 77 ఏళ్లు. ఇద్దరూ దాదాపు 20 ఏళ్లుగా కలిసుంటున్నారు. కానీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వడం ఆమెకు నచ్చలేదు. అంతే.. విడాకులు ఇచ్చి పారేసింది. తన భర్త బిల్ మెక్ కార్మిక్ స్నేహితులతో కలిసి లంచ్ చేస్తున్న సందర్భంలో తాను ట్రంప్‌కు ఓటేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినప్పుడు తాను ఎంతో షాకయ్యానని కాలిఫోర్నియా జైలు గార్డుగా పనిచేసి రిటైరైన గేల్ మెక్ కార్మిక్ చెప్పారు. దాంతో తన గుండె బద్దలైందని అన్నారు. తామిద్దరం విడిపోవడానికి అదే ప్రధాన కారణమన్నారు. ఆమె ప్రస్తుతం వాషింగ్టన్‌లోని తన సొంత అపార్టుమెంటులో ఒక్కరే ఉంటున్నారు. విడిపోవాలన్న నిర్ణయం తీసుకోడానికి తమకు చాలా చాలా నెలలు పట్టిందని, కౌన్సెలింగ్‌కు వెళ్లి, ఒక మతగురువును సంప్రదించి.. ఇలా చాలా చేశామని, ఇదేదో హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదని ఆమె అన్నారు.
గేల్, బిల్ ఇద్దరూ 1980లో తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ ఒకే జైల్లో పనిచేసేవారు. అన్ని విషయాల్లో అభిప్రాయాలు 51 శాతం కలిసి, 49 శాతం కలవకపోయినా ఇద్దరూ కలిసే ఉండొచ్చని, తాను ఇప్పటికే బాగా అలిసిపోయి ఉన్నానని, అందువల్ల ఇద్దరిలో ఎవరికీ మారడం ఇష్టం లేనప్పుడు వాదించాలని అనుకోలేదని గేల్ చెప్పారు. రాజకీయాల చర్చ ఎప్పుడైనా వస్తే అక్కడినుంచి లేచి వెళ్లిపోయేదాన్నని, కేవలం ట్రంప్ విషయంలో మాత్రం మాట్లాడకుండా ఉండలేకపోయానని అన్నారు. తామిద్దరి మధ్య చాలా తేడాలున్నాయని, అయినా ఇప్పటికీ తాను అతడిని ప్రేమిస్తున్నానని, అతడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నానని చెప్పారు.