బ్యాంకు ఖాతాలు తెరిపిస్తానంటూ మహిళలకు టోకరా | Woman cheated to open bank accounts | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతాలు తెరిపిస్తానంటూ మహిళలకు టోకరా

Aug 19 2015 5:46 PM | Updated on Aug 28 2018 8:04 PM

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఎస్‌బీఐ బ్యాంకు శాఖ వద్ద ఓ కేటుగాడు ఎనిమిది మంది మహిళలను బురిడీ కొట్టించాడు.

పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఎస్‌బీఐ బ్యాంకు శాఖ వద్ద ఓ కేటుగాడు ఎనిమిది మంది మహిళలను బురిడీ కొట్టించాడు. బాధితుల కథనం మేరకు... వంటగ్యాస్ కనెక్షన్ కోసం ఖాతాలు తెరిచేందుకు కందరాడ గ్రామానికి చెందిన ఎమిమిది మంది మహిళలు బుధవారం బ్యాంకుకు వచ్చారు. ఏజెంట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ఓ వ్యక్తి వారి దగ్గరకు వచ్చాడు.

వారు ఎందుకు వచ్చిందీ వివరాలు తెలుసుకుని... ఏజెంట్ వచ్చేందుకు సమయం పడుతుందని, తాను ఖాతాలు తెరిపిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.1,200 వసూలు చేశాడు. ఆ తర్వాత రెవెన్యూ స్టాంపులు తీసుకురావాలని చెప్పడంతో వారు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా అతడు పరారయ్యాడు. స్టాంపులతో బ్యాంకు శాఖకు తిరిగి వచ్చిన మహిళలు తాము మోసపోయామని తెలుసుకుని బ్యాంకు వారిని సంప్రదించారు. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement