బుర్హాన్ టెర్రరిస్టు కాదా? ఇండియన్ ఎజెంటా? | Who was the real Burhan Wani, paper tiger or Indian agent? | Sakshi
Sakshi News home page

బుర్హాన్ టెర్రరిస్టు కాదా? ఇండియన్ ఎజెంటా?

Jul 12 2016 11:57 AM | Updated on Sep 4 2017 4:42 AM

కశ్మీర్ లోయలో ప్రస్తుతం రగులుతున్న కల్లోలానికి ప్రధాన కారణం హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ ముజఫర్ వనినీ భధ్రతాదళాలు కాల్చిచంపడం.

శ్రీనగర్: కశ్మీర్ లోయలో ప్రస్తుతం రగులుతున్న కల్లోలానికి ప్రధాన కారణం హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ ముజఫర్ వనినీ భధ్రతాదళాలు కాల్చిచంపడం. బుర్హాన్ కశ్మీరీ యూత్ ని ఆకర్షించి మిలిటెంట్లలోకి చేర్చే ఒక వ్యక్తి అని కేవలం సోషల్ మీడియాలో అతన్ని అనుసరించే వారికే తెలుసు. సాధారణ కశ్మీరీ పౌరుడి దృష్టిలో అతనొక 'ఇండియన్ ఏజెంట్'.

బుర్హాన్ ఎన్ కౌంటర్ పై పత్రికల్లో వార్తలు వచ్చే వరకూ అక్కడి సాధారణ పౌరుడి అభిప్రాయం మారలేదు. దేశంలోని ప్రజలందరూ బుర్హాన్ కాల్చివేత  యాంటీ టెర్రర్ ఆపరేషన్ గా భావిస్తే, జమ్మూ అండ్ కశ్మీర్ లిజరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్)కు చెందిన వారు మాత్రం బుర్హాన్ ను అమరవీరుడిగా ప్రచారం చేశారు. 1970ల్లో మిలిటెన్సీ ఉద్యమాన్ని నడపడంలో చక్రం తిప్పిన మక్బుల్ భట్ ను పాకిస్తాన్ భారతీయ గూఢచారిగా భావించి జైలుకు పంపింది. కశ్మీర్ లో కూడా భట్ గూఢచారిగా పనిచేస్తున్నాడని దృఢ నమ్మకం ఉండేది. కానీ, ఇండియా భట్ ను ఉరి తీసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత 1980ల్లో ప్రారంభించిన జేకేఎల్ఎఫ్ కు భట్ పోస్టర్ ను ఉపయోగించి ప్రచారాన్ని ప్రారంభించారు. జైషే-ఈ-మహమ్మద్(జేఈఎమ్) చీఫ్ అఫ్జల్ గురూ కూడా కొంతకాలం వివాదాల చిక్కుకున్నాడు. సంస్థకు చెందిన అజాదీని ఉరి తీసిన తర్వాత పట్టు కలిగిన నేతగా ఎదిగాడు. అజాదీ జైల్లో ఉన్నప్పుడు ఒక్క కశ్మీరీ లాయర్ కూడా కేసును వాదించేందుకు ముందుకు రాలేదు. అందుకు ప్రధానకారణం 2001 పార్లమెంట్ దాడులకు సంబంధించిన సమాచారాన్ని అజాదీనే భారత్ కు చేరవేశాడని వేర్పాటువాదుల బలమైన నమ్మకం.

2008 అమర్ నాథ్ భూ వివాదం తర్వాత మిగతా మిలిటెంట్లలానే హిజ్బుల్, జేఈఎమ్ లకు బుర్హాన్ సమాచారం చేరవేస్తూ ఉండేవాడు. ఇవన్నీ చూసిన కశ్మీర్ ప్రజలు ఇతన్ని కూడా భారతీయ గూఢచారిగానే భావిస్తూ వచ్చారు. అతను నిజమైన ముజహిద్ అయితే, పోలీసులు అతన్ని చంపేసి ఉండాలి. కానీ, ఫేస్ బుక్ లో అతను పోస్టులు చేస్తుంటే భద్రతాదళాలు ఎందుకు చూస్తూ ఊరుకున్నాయి? ఇలాంటి ప్రశ్నలతో బుర్హాన్ ఓ గూఢచారి అనే ప్రచారం కశ్మీర్ లో ముఖ్యంగా దక్షిణ కశ్మీర్ లో జరిగింది.

గత రెండు నెలలుగా సీఆర్పీఎఫ్, మిగతా భద్రతా దళాలపై మిలిటెంట్లు దాడులు చేసి జవానులను కాల్చి చంపుతున్నారు. దీంతో ఆపరేషన్ ను ప్రారంభించిన భద్రతాదళాలను మిలిటెంట్లు దారి మళ్లించి ఇంతవరకూ ఎవరినీ చంపకుండా.. కేవలం సోషల్ మీడియా ద్వారా యువతను ప్రభావితం చేస్తున్న బుర్హాన్ ను చంపేలా పాకిస్తాన్ కుట్ర చేసిందనీ ఓ అధికారి అన్నారు. బుర్హాన్ కాల్చివేతతో కశ్మీర్ లో కల్లోల పరిస్థితులు కల్పించడమే పాక్ ఉద్దేశమని, ప్రస్తుతం అదే జరుగుతోందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement