వెల్దుర్తి ఎస్సైపై సస్పెన్షన్ వేటు | Velurdhi SI suspended by negligence of duty | Sakshi
Sakshi News home page

వెల్దుర్తి ఎస్సైపై సస్పెన్షన్ వేటు

Aug 12 2015 4:10 PM | Updated on Sep 2 2018 5:06 PM

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పోలీస్‌స్టేషన్ ఎస్సై మారుతి శంకర్‌పై వేటు వేశారు.

వెల్దుర్తి(కర్నూలు జిల్లా): విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పోలీస్‌స్టేషన్ ఎస్సై మారుతి శంకర్‌పై వేటు వేశారు. ఈ మేరకు బుధవారం డీఐజీ నుంచి మారుతిశంకర్‌ను సస్పెండ్ చేయమని ఉత్తర్వులు అందాయని డోన్ డివిజన్ డీఎస్పీ టీఎన్ బాబు మీడియాకు తెలిపారు. మారుతి శంకర్ మండలం పరిధిలోని మట్కా, సారా, పేకాట మొదలైన అసాంఘీక కార్యకలాపాలను అడ్డుకోవడంతో పూర్తిగా విఫలమయ్యాడని ఆయన అన్నారు.

అంతేకాకుండా మండల పరిధిలో జరుగుతున్న అక్రమ ఇనుప ఖనిజ తవ్వకాలను ఆయన అడ్డుకోలేకపోయాడని విచారణలో తేలిందని డీఎస్సీ చెప్పారు. రికార్డులను సకాలంలో పూర్తి చేయకపోవడం, వృత్తి పట్ల నిబద్దత లేకపోవడంతో సస్పెండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement