ఏప్రిల్ 1 నుంచి హెచ్-1బి వీసాలకు దరఖాస్తుల స్వీకరణ | US will issue 65 thousand visas | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 1 నుంచి హెచ్-1బి వీసాలకు దరఖాస్తుల స్వీకరణ

Mar 26 2014 2:44 PM | Updated on Sep 26 2018 6:44 PM

ఏప్రిల్ 1 నుంచి హెచ్-1బి  వీసాలకు దరఖాస్తుల స్వీకరణ - Sakshi

ఏప్రిల్ 1 నుంచి హెచ్-1బి వీసాలకు దరఖాస్తుల స్వీకరణ

అమెరికా ఈ ఏడాది 65వేల హెచ్-1బి వీసాలు జారీ చేయనుంది. ఈ వీసాల కోసం ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

వాషింగ్టన్: అమెరికా ఈ ఏడాది 65వేల హెచ్-1బి  వీసాలు జారీ చేయనుంది. ఈ వీసాల కోసం ఏప్రిల్1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 28న అర్హులైనవారిని గుర్తిస్తారు. అమెరికాలో ఉండే విదేశీ వృత్తి నిపుణులకు  హెచ్1బీ వీసాలు జారీ చేస్తారు.  సెనేట్ ఇమ్మిగ్రేషన్ పథకం ప్రకారం యూఎస్ ప్రభుత్వం జారీ చేసే హెచ్1బీ వీసాల సంఖ్య రెట్టింపు అయింది. ప్రస్తుతం ఏడాదికి 65వేల  వరకూ హెచ్1బీ వీసాలు జారీ చేస్తున్నారు.  

అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు సంబంధించి భారత దేశం ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో ఉంది. కొత్తగా జారీ చేసే ఈ వీసాల వల్ల భారతీయ నిపుణులకు లబ్ది చేకూరే అవకాశం ఉంది.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆకట్టుకునేందుకు  1990లో  హెచ్1బీ వీసాల జారీ చేయడం మొదలు పెట్టారు.  అయితే  ఔట్‌సోర్సింగ్ సంస్థలు తక్కువ జీతాలతో ఉద్యోగులను అమెరికాకు తీసుకువచ్చేందుకు వీటిని బాగా వినియోగించుకుంటూ ఉంటాయి. హెచ్-1బి  వీసాలను ఈ విధంగా వినియోగించుకునే సంస్థలలో అమెరికాలో తమ కార్యకలాపాలను నిర్వహించే భారతీయ ఐటి కంపెనీలే ఎక్కువగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement