'చపాతి' ఘటనపై అట్టుడికిన పార్లమెంట్ | Uproar in both Parliament Houses over chapati incident | Sakshi
Sakshi News home page

'చపాతి' ఘటనపై అట్టుడికిన పార్లమెంట్

Jul 23 2014 1:17 PM | Updated on Sep 2 2017 10:45 AM

'చపాతి' ఘటనపై అట్టుడికిన పార్లమెంట్

'చపాతి' ఘటనపై అట్టుడికిన పార్లమెంట్

శివసేన ఎంపీలు ముస్లిం కార్మికుడితో బలవంతంగా చపాతి తినిపించిన ఘటన పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది.

న్యూఢిల్లీ: శివసేన ఎంపీలు ముస్లిం కార్మికుడితో బలవంతంగా చపాతి తినిపించిన ఘటన పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. ఈ ఉదయం లోక్సభ ప్రారంభంకాగానే పలువురు విపక్ష ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. మత స్వేచ్ఛను శివసేన ఎంపీలు కాలరాశారని విమర్శించారు. వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఉండగానే ఈ గందరగోళం చోటుచేసుకుంది. స్పీకర్ సమిత్రా మహాజన్ సర్దిచెప్పినా వారు వెనక్కు తగ్గలేదు. దీంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా 'చపాతి' ఘటనపై అట్టుడికింది.

ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్ లో తమకు మహారాష్ట్ర వంటకాలు వండిపెట్టలేదన్న కారణంతో ఆగ్రహానికి గురైన 11 మంది ఎంపీలు ముస్లిం మతస్థుడైన కేటరింగ్ సూపర్వైజర్ తో బలవంతంగా చపాతి తినిపించారు. అతడి రంజాన్ ఉపవాస దీక్షను భగ్నం చేశారు. ఈ వీడియో వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో విపక్షాలు భగ్గుమన్నాయి.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement