కన్న కూతురును కాపాడబోయి.. | UP man beaten to death for protecting daughter's honour | Sakshi
Sakshi News home page

కన్న కూతురును కాపాడబోయి..

Sep 2 2016 5:47 PM | Updated on Sep 4 2017 12:01 PM

కన్న కూతురును కాపాడబోయి..

కన్న కూతురును కాపాడబోయి..

ఆకతాయిల ఆగడాల నుంచి కూతురును కాపాడాలనుకున్న తండ్రి హత్యకు గురయ్యాడు.

అమ్రోహ(యూపీ): ఆకతాయిల ఆగడాల నుంచి కూతురును కాపాడాలనుకున్న తండ్రి హత్యకు గురయ్యాడు. ఉత్తర్ ప్రదేశ్లోని అమ్రోహ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. కొందరు ఆకతాయిలు ఇంటర్మీడియట్ చదువుకుంటున్న బాధితురాలిని తరచుగా వేధించేవారు. స్థానికంగా నివాసముండే ఆ యువకుల ఆగడాలు శృతిమించడంతో తండ్రికి జరిగిన విషయాన్ని బాధితురాలు తెలిపింది.

వేధింపుల విషయాన్ని బాధితురాలి తండ్రి, యువకుల తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చాడు. దీంతో ఆగ్రహించిన యువకులు బుధవారం రాత్రి సమయంలో బాధితురాలి ఇంటికి చేరుకొని ఆమె తండ్రిపై దాడికి దిగారు. తీవ్రగాయాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన పై విచారణకు ఆదేశించినట్టు ఏఎస్పీ ఉదయ్ శంకర్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement