
ఇద్దరు అగ్ర నేతల వల్లే...
జీఎస్టీ బిల్లును అడ్డుకోవడానికే సుష్మ స్వరాజ్ రాజీనామా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు.
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును అడ్డుకోవడానికే సుష్మ స్వరాజ్ రాజీనామా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు.
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడాన్ని ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నా... ఇద్దరు అగ్ర నేతలు సభా కార్యకలాపాలను అడ్డుకోవాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. దేశ అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ ఆటంకం కలిగిస్తోందని జైట్లీ విమర్శించారు.