ఇద్దరు వివాహితలు అదృశ్యం! | two married woman who went from home disappear | Sakshi
Sakshi News home page

ఇంట్లోంచి వెళ్లి.. ఇద్దరు వివాహితలు..

Nov 6 2016 8:07 PM | Updated on Aug 25 2018 6:13 PM

నగరంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు వివాహితలు అదృశ్యమయ్యారు.

చాంద్రాయణగుట్ట (హైదరాబాద్‌ సిటీ): నగరంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు వివాహితలు అదృశ్యమయ్యారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివి..
 
కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయింది. మేకలమండి ప్రాంతానికి చెందిన జీ.దుర్గా కూతురు వీ.దివ్య(22) దీపావళి పండుగను పురస్కరించుకొని తల్లిగారింటికి వచ్చింది. శనివారం కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్లను తీసుకొస్తానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన దివ్య తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో వేణు అనే యువకుడిపై అనుమానం ఉందని పేర్కొంటూ ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో గాని 9490616505, 9490616500 నంబర్లలో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.
 
ఇంట్లో చెప్పకుండా వెళ్లి..
ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైంది. జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన ఎన్.రమేష్, త్రివేణిలు భార్యభర్తలు. ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన త్రివేణి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో భర్త ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 5.3 అడుగుల ఎత్తున్న ఆమె ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో గాని 9490616505, 9490616500 నంబర్లలో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement