బస్సుకు కరెంట్ షాక్ | Tonk district in bus electric shock | Sakshi
Sakshi News home page

బస్సుకు కరెంట్ షాక్

Jun 13 2015 2:13 AM | Updated on Sep 5 2018 3:37 PM

బస్సుకు కరెంట్ షాక్ - Sakshi

బస్సుకు కరెంట్ షాక్

రాజస్తాన్‌లో ఒక బస్సుపై విద్యుత్ తీగలు పడిన సంఘటనలో 15 మంది మృతిచెందారు. శుక్రవారం టోంక్‌జిల్లాలోని పచేవర్‌లో ఈ ప్రమాదం జరిగింది.

15 మంది మృతి.. రాజస్తాన్‌లో దుర్ఘటన
జైపూర్: రాజస్తాన్‌లో ఒక బస్సుపై విద్యుత్ తీగలు పడిన సంఘటనలో 15 మంది మృతిచెందారు. శుక్రవారం టోంక్‌జిల్లాలోని పచేవర్‌లో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్‌తో మరో 26 మంది ప్రయాణికులకు కాలిన గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని జిల్లా కలెక్టర్ రేఖా గుప్తా తెలిపారు. 41 మందితో పెళ్లి బృందం ప్రైవేటు బస్సులో బసేదా నుంచి మోర్లా గ్రామానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.

ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందడంపట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుంటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్ర హోంమంత్రి, విద్యుత్, వ్యవసాయశాఖల మంత్రులు సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement