ముగ్గురు ఉగ్రవాదులు హతం! | Three militants killed as army foils infiltration bid in Gurez | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఉగ్రవాదులు హతం!

Jul 27 2017 1:16 PM | Updated on Sep 5 2017 5:01 PM

ముగ్గురు ఉగ్రవాదులు హతం!

ముగ్గురు ఉగ్రవాదులు హతం!

జమ్మూకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటుయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి.

చొరబాటుయత్నాన్ని భగ్నం చేసిన భద్రతా దళాలు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటుయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. 'గురేజ్‌ సెక్టార్‌లో ఎల్‌వోసీ వద్ద గురువారం ఉదయం జరిగిన చొరబాటుయత్నాన్ని భగ్నం చేశాం. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు' అని ఆర్మీ తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో వెల్లడించింది.

అనంతరం మరో ఉగ్రవాది హతమైనట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఇక్కడ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గత నెలలో కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్‌లో చొరబాటు యత్నాన్ని భగ్నం చేసి.. ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement