ప్రత్యేక హోదాపై ఎన్నారైల సెల్ఫీ వీడియోలు | telugu NRIs selfe videos on andhra pradesh special status issue | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాపై ఎన్నారైల సెల్ఫీ వీడియోలు

Oct 5 2015 7:04 PM | Updated on Jul 24 2018 1:16 PM

ప్రత్యేక హోదాపై ఎన్నారైల సెల్ఫీ వీడియోలు - Sakshi

ప్రత్యేక హోదాపై ఎన్నారైల సెల్ఫీ వీడియోలు

ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాన్ని విదేశాల్లోని తెలుగువారు వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై హామీయిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. హోదాపై కేంద్రాన్ని నిలదీయాల్సిన ఏపీ సర్కారు మిన్నకుండిపోయింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర శంఖం పూరించారు. ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని విదేశాల్లోని తెలుగువారు వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఎన్నారైలు తమ సెల్ఫీ వీడియోల ద్వారా తమ అభిప్రాయాలను 'సాక్షి'తో పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement