పాక్ సరిహద్దుల్లో.. అత్యంత ఎత్తయిన పతాకం | Sakshi
Sakshi News home page

పాక్ సరిహద్దుల్లో.. అత్యంత ఎత్తయిన పతాకం

Published Mon, Mar 6 2017 9:44 AM

పాక్ సరిహద్దుల్లో.. అత్యంత ఎత్తయిన పతాకం

దేశంలోనే అత్యంత ఎత్తయిన జాతీయ పతాకం ఎక్కడుంది అంటే.. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో అని చెప్పబోతున్నారా? ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లోని అటారీ సమీపంలో మన దేశంలోనే ఇంతవరకు అత్యంత ఎత్తయిన జాతీయపతాకాన్ని సోమవారం ఉదయం ఆవిష్కరించారు. దీని ఎత్తు 360 అడుగులు. జెండా పొడవేప 12 అడుగులు ఉంటుందని చెబుతున్నారు.

ఇంతకుముందు జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. అంతకంటే ఎత్తయిన పోల్, పెద్ద జెండా తెలంగాణలో ఎగురవేయాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు నెక్లెస్‌రోడ్డులో 300 అడుగుల ఎత్తున ఓ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోల్‌కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీ దీన్ని ఏర్పాటుచేసింది. ఇప్పుడు దానికంటే మరో 60 అడుగులు ఎక్కువ ఎత్తులో అమృతసర్ వద్ద ఈ కొత్త జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Advertisement
Advertisement