జల్లికట్టుపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు | Supreme Court Refuses to give Stay on New Jallikattu Act | Sakshi
Sakshi News home page

జల్లికట్టుపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు

Jan 31 2017 5:54 PM | Updated on Sep 2 2018 5:28 PM

జల్లికట్టు విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

జల్లికట్టు విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జల్లికట్టు చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలవ్వాల్సిన జల్లికట్టు ఉత్సవాలకు అడ్డం లేకుండా పోయింది. అయితే, కొత్త చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. ఆ విషయమై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఆరు వారాల సమయం ఇచ్చింది. జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని ప్రభుత్వానికి సూచించింది. 
 
జల్లికట్టు ఉత్సవాన్ని నిర్వహించడానికి అనుమతినిస్తూ రాష్ట్ర అసెంబ్లీ జనవరి 23వ తేదీన ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. తమిళనాడులో జనవరి నుంచి మే నెల వరకు జల్లికట్టుతో పాటు మంజువిరట్టు, వడమాడు, ఎరుదువిడుం లాంటి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాల నిఘా ఉంచాలని, అలాగే ఉత్సవాల్లో పాల్గొనే ఎడ్లకు ముందుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కూడా చట్టంలో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement