చిలీలో భూకంపం | Strong earthquake shakes Chile's capital | Sakshi
Sakshi News home page

చిలీలో భూకంపం

Nov 1 2013 8:28 AM | Updated on Aug 24 2018 7:34 PM

చిలీ రాజధాని శాంటియాగోలోని మధ్య ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే శుక్రవారం వెల్లడించింది.

చిలీ రాజధాని శాంటియాగోలోని మధ్య ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే శుక్రవారం వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 6.6గా నమోదు అయిందని తెలిపింది. అయితే భూంకంపం వల్ల ప్రాణనష్టం కానీ ఆస్తినష్టం కాని సంభవించినట్లు ఇంకా తమకు సమాచారం అందలేదని పేర్కొంది.

 

ప్రపంచంలో భూకంపం తరచుగా సంభవించే దేశాల్లో చీలి ఒకటని చెప్పింది. అయితే 2010లో సునామీ సందర్భంగా చిలీలో సంభవించిన భూకంపం వల్ల 500 మంది మృత్యువాత పడ్డారని అలాగే దాదాపు 2.5 లక్షల ఇళ్లు నేలమట్టమైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ఈ సందర్భంగా గుర్తు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement