స్టార్టప్స్‌ సంక్షోభం...ఉద్యోగులపై భారీ వేటు | Startups shed jobs! Over 1,600 given pinks slips, more in firing line | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్‌ సంక్షోభం...ఉద్యోగులపై భారీ వేటు

Mar 1 2017 1:22 PM | Updated on Sep 5 2017 4:56 AM

స్టార్టప్స్‌ సంక్షోభం...ఉద్యోగులపై భారీ వేటు

స్టార్టప్స్‌ సంక్షోభం...ఉద్యోగులపై భారీ వేటు

దేశీయ ఈ-కామర్స్ సంస్థల ఉద్యోగులు ప్రమాదంలో పడనున్నారు. ఇటీవల వందలమందిపై వేటు వేసిన దేశీయ అతిపెద్ద ఈ కామర్స్‌ స్నాప్‌డీల్‌ బాటనే ఇతర సంస్థలు అనుసరిస్తున్నాయి.

ముంబయి / న్యూఢిల్లీ / బెంగళూరు:  దేశీయ  ఈ-కామర్స్  సంస్థల ఉద్యోగులు ప్రమాదంలో పడనున్నారు.  ఇటీవల వందలమందిపై వేటు వేసిన దేశీయ అతిపెద్ద ఈ కామర్స్‌ స్నాప్‌డీల్‌ బాటనే ఇతర సంస్థలు అనుసరిస్తున్నాయి.  ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా   ఈ-కామర్స్, ఫుడ్-టెక్, లాజిస్టిక్ స్టార్టప్ కంపెనీలు  భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధపడుతున్నాయి.   దాదాపు16వందలమందికి పైగా 'పింక్ స్లిప్'లను జారీ చేశాయి. ఈ వేసవిలో వారంతా మరో ఉద్యోగాన్ని చూసుకోవాలని అల్టిమేట్టం కూడా జారీ చేశాయి.  ముఖంగా  సంప్రదాయ వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్న క్రాఫ్ట్స్ విల్లా, ఫ్యాషన్ పోర్టల్ యప్ మీ, టోలెక్సో వంటి స్టార్టప్ కంపెనీలు ఇటీవల వందలమందిని  తొలగించేందుకు నిర్ణయించాయి. స్థిరమైన వృద్ధితో వేగంగా ఎదగలేక పోతున్న మధ్యతరహా సంస్థలు ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పేరిట వందలాది మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాయని ఈ దోరణి  ఇంకా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రధానంగా అత్యధికులను ఈ సంవత్సరమే తీసివేసే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ వజీర్ అడ్వయిజర్స్ ఎండీ హర్మీందర్ సాహ్నీ వ్యాఖ్యానించారు. మరికొన్ని కంపెనీలు పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయన్నారు.

పేమెంట్ గేట్ వే సంస్థ పేయూ, తన 85 మంది ఉద్యోగుల కాల్ సెంటర్ విభాగాన్ని 25 మందికి కుదించింది.  మాతృసంస్థ ఇండియా మార్ట్ లో విలీనమైన టొలెక్సో, 50 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తామీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టొలెక్సో  సీఈఓ బ్రిజేష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల తొలగింపుకు స్పందించిన ఆయన కారణాలను వెల్లడించేందకు నిరాకరించినప్పటికీ.. డీమానిటైజేషన్‌ కూడా ఒక కారణమన్నారు.

ఫ్యాషన్‌ రీటైలర్‌  'యప్ మీ'  వేర్‌హౌసింగ్‌, క్వాలిటీకంట్రోల్‌ విభాగంనుంచి ఉద్యోగులను తొలగించింది. తాము పెట్టిన పెట్టుబడులు గత సంవత్సరంలోనే తిరిగి వస్తాయని ఆశించామని, కానీ నోట్ల రద్దు కారణంగా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయామని  సంస్థ వ్యవస్థాపకుడు వివేక్ గౌర్  చెప్పారు. నోట్ల రద్దు తరువాత ఇండియాలో అమ్మకాలు పడిపోయాయని, దీంతో విదేశాల్లో విస్తరణపై దృష్టిని సారించేందుకు ఇక్కడ ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

మరోవైపు క్రాఫ్ట్స్ విల్లా సంస్థ తన పూర్తి ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని మూసివేస్తూ, 100 మందికి పైగా ఉద్యోగులను,  ఇతర ఉన్నతాధికారులను తొలగించింది. ఈ తొలగింపుపై వివరణ కోరేందుకు సంస్థ సీఈఓ మనోజ్ గుప్తాను సంప్రదించాలని చూడగా, ఆయన అందుబాటులో లేరు.

కాగా, స్టార్టప్ సంస్థల్లో నిధుల లేమి, పెట్టుబడుల కొరత కూడా ఉద్యోగాల తొలగింపునకు కారణంగా తెలుస్తోంది. 2015లో సుమారు రూ. 13 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన స్టార్టప్ సంస్థలు, గత సంవత్సరం కేవలం రూ. 8,500 కోట్ల  పెట్టుబడులకు పరిమితం అయ్యాయి. 2015తో పోలిస్తే, ఇది దాదాపు 28 శాతం తక్కవ. దీంతో మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని నిపుణులు  పేర్కొంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement