భారతి మెడకు బిగుస్తున్న ఉచ్చు | Somnath Bharti controversy: Arvind Kejriwal meets Lt Governor | Sakshi
Sakshi News home page

భారతి మెడకు బిగుస్తున్న ఉచ్చు

Jan 23 2014 2:43 PM | Updated on Sep 2 2017 2:55 AM

భారతి మెడకు బిగుస్తున్న ఉచ్చు

భారతి మెడకు బిగుస్తున్న ఉచ్చు

వ్యభిచారం, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలపై ఆఫ్రికన్ మహిళలపై మద్దతుదారులతో కలసి గత బుధవారం అర్ధరాత్రి దాడి చేయించిన ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి మెడకు ఉచ్చు బిగుస్తోంది.

న్యూఢిల్లీ: వ్యభిచారం, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలపై ఆఫ్రికన్ మహిళలపై మద్దతుదారులతో కలసి గత బుధవారం అర్ధరాత్రి దాడి చేయించిన ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా మరో ఉగాండా మహిళ కోర్టును ఆశ్రయించింది. తమపై దాడి చేసిన మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్‌ చేసింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది.

కాగా, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉదయం కలిశారు. మంత్రి సోమనాథ్ భారతిపై ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి పదవి నుంచి సోమనాథ్ భారతిని వెంటనే తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement