తొలిపోరులో సైనా గెలుపు | saina nahwal wins first game in ibl against p.v sindhu | Sakshi
Sakshi News home page

తొలిపోరులో సైనా గెలుపు

Aug 15 2013 5:58 PM | Updated on Sep 1 2017 9:51 PM

తొలిపోరులో సైనా గెలుపు

తొలిపోరులో సైనా గెలుపు

హోరాహోరీగా సాగిన ఇండియన్ బ్యాడ్మింట్‌న్ లీగ్ సింగిల్స్ తొలిపోరులో సైనా నెహ్వాల్ 21-19, 21-8 తేడాతో పి.వి. సింధుపై విజయం సాధించి శుభారంభం చేసింది

ఢిల్లీ: హోరాహోరీగా సాగిన ఇండియన్ బ్యాడ్మింట్‌న్ లీగ్ సింగిల్స్ తొలిపోరులో సైనా నెహ్వాల్ 21-19, 21-8 తేడాతో పి.వి. సింధుపై విజయం సాధించి శుభారంభం చేసింది  గురువారం జరిగిన గేమ్ లో సైనా రెండు వరుస సెట్లను కైవసం చేసుకుని సింధుకు షాకిచ్చింది.  సింధు నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ సైనా అనుభవం ముందు నిలవలేకపోయింది. వీరిద్దరి మధ్య తొలి సెట్ పోటీయే నువ్వా.. నేనా అన్నట్లు సాగినా, రెండో సెట్ ను సైనా అవలీలగా కైవసం చేసుకుంది. ఈ పోరు అసలు సిసలైన ఐబీఎల్ మజాను ప్రేక్షకులకు అందించింది.

గోపీచంద్ అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేసిన ఈ ఇద్దరూ తొలిసారిగా ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్‌)లో ముఖాముఖి తలపడిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్ లో హైదరాబాద్ హాట్‌షాట్స్ తరపున సైనా నెహ్వాల్ బరిలోకి దిగగా, అవధ్ వారియర్స్ తరపున సింధు  పోటీకి సిద్ధమైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement