సాహో.. బాలకృష్ణ.. శాతకర్ణి!

సాహో.. బాలకృష్ణ.. శాతకర్ణి! - Sakshi


నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' బుధవారం విడుదల అవుతున్న సందర్భంగా ట్విట్టర్ లో బాలయ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. సినిమా ఘనవిజయం సాధించాలంటూ తెలుగు సినీ ప్రముఖులంతా సోషల్ మీడియాలో ఆకాంక్షించారు.



'స్వాహో బసవతారకమ్మ పుత్ర బాలకృష్ణ. నందమూరి తారక రామారావుగారి గర్వపడేరీతిలో శాతకర్ణిగా నటించిన (బాలకృష్ణ) సార్ కు సెల్యూట్ చేస్తున్నా. పైనుంచి ఎన్టీఆర్ ఆశీస్సులు మీకు ఉంటాయి' అని ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ' అజంనాపుత్ర క్రిష్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12కోట్లమంది తెలుగువారి ఆశీస్సులు నీకు ఉన్నాయి. 79 రోజుల్లో ఈ ఎపిక్ సినిమాను మీరు ఎలా తీశారు? నమ్మశక్యం లేదు. మీ నుంచి నేను చాలాచాలా మార్చుకోవాలి. సాయిమాధవ్ గారు మీ పెన్నే శాతకర్ణి కత్తి. అద్భుతమైన కెమెరా వర్క్, అసాధారణ నిర్మాణ విలువలు గర్వించే తెలుగు సినిమాగా శాతకర్ణిని చాలారోజులు గుర్తుండిపోయేలా చేస్తాయి' అని రాజమౌళి పేర్కొన్నారు.

 

ప్రముఖ హీరోలు నాగార్జున, మోహన్ బాబులు కూడా బాలయ్య, దర్శకుడు క్రిష్ కు ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. చారిత్రక సినిమాలు చూడటం తనకు ఇష్టమని, ఈ సినిమా చరిత్ర సృష్టించాలని నాగార్జున ఆకాంక్షించారు. సంగీత దర్శకుడు థమన్, యాంకర్ అనసూయ కూడా ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో తనకు చిన్నపాత్రను ఇచ్చినందుకు అనసూయ దర్శకుడు క్రిష్ కి కృతజ్ఞతలు తెలిపింది.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top