బ్రహ్మోత్సవాల్లో దాతలకే గదులు | Rooms to Donors at brahmosthavam | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాల్లో దాతలకే గదులు

Sep 19 2016 2:00 AM | Updated on Jul 29 2019 6:07 PM

బ్రహ్మోత్సవాల్లో దాతలకే గదులు - Sakshi

బ్రహ్మోత్సవాల్లో దాతలకే గదులు

అక్టోబరు 3 నుంచి తిరుమలలో నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామని టీటీడీ ప్రజాసంబంధాల విభాగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

సిఫారసులకు గదుల కేటాయింపు, అడ్వాన్స్ బుకింగ్ రద్దు  

 సాక్షి, తిరుమల: అక్టోబరు 3 నుంచి తిరుమలలో నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామని టీటీడీ ప్రజాసంబంధాల విభాగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గదులు కావాల్సిన కాటేజీ దాతలు 5 రోజుల ముందుగానే సెల్ఫ్ డోనార్ స్లిప్పులు తిరుమలలోని రిసెప్షన్-1, ఉప కార్యనిర్వహణాధికారికి సమర్పించాలి. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రద్దీ కారణంగా 6, 7 తేదీల్లో దాతలకు కూడా గదులు కేటాయించడం లేదని తెలిపింది.

 అడ్వాన్స్ బుకింగ్ కూడా రద్దు : బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో గదుల అడ్వాన్స్ బుకింగ్‌ను టీటీడీ రద్దు చేసింది. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో సాంబశివరావు, నిర్ణయించారు. సిఫారసు లేఖలు కూడా మంజూరు రద్దు చేశారు. సిఫారసుల్లో  కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే గదులు మంజూరు చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement