సుష్మా స్వరాజ్ సహకారం మరువలేనిది | rapolu ananda bhaskar praised sushma swaraj | Sakshi
Sakshi News home page

సుష్మా స్వరాజ్ సహకారం మరువలేనిది

Feb 20 2014 6:39 PM | Updated on Sep 2 2017 3:55 AM

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ)బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడం పై బీజేపీ సీనియర్ నేత సుప్మా స్వరాజ్ అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిదని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడం పై బీజేపీ సీనియర్ నేత సుప్మా స్వరాజ్  అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిదని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. విభజన బిల్లు రాజ్యసభ వచ్చిన సందర్భంగా రాపోలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాన కారణమైతే, బిల్లు ఆమోదం పొందడానికి సుష్మా స్వరాజ్ కూడా ఒక కారణమన్నారు.

 

ఆమె అందించిన సహకారం ఎనలేనిదిగా రాపోలు అభివర్ణించారు. సోనియాను తెలంగాణ ప్రజలు రాష్ట్ర దేవతగా ఆరాధిస్తున్నారని తెలిపారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కేంద్రానికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement