'హామీ మేరకే రైతులు పంటలు వేశారు' | Ramreddy pratap kumar reddy slams minister Devineni uma maheswara rao | Sakshi
Sakshi News home page

'హామీ మేరకే రైతులు పంటలు వేశారు'

Apr 20 2015 4:44 PM | Updated on Sep 3 2017 12:35 AM

'హామీ మేరకే రైతులు పంటలు వేశారు'

'హామీ మేరకే రైతులు పంటలు వేశారు'

నెల్లూరు జిల్లా రైతులను ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తప్పుదోవ పట్టిస్తున్నారని కావలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లా రైతులను ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తప్పుదోవ పట్టిస్తున్నారని కావలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. ఎకరా కూడా ఎండనివ్వమని చెబుతున్న మంత్రి ఉమాకు కావలిలో ఎండిన పంటలు కనబడలేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఐఏడీఏలో ఇచ్చిన హామీ మేరకే రైతులు పంటలు వేశారని ఆయన అన్నారు. నీరు ఇవ్వకపోవడంతో రైతులు అన్ని విధాలా నష్టపోయారని రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమతో రైతులను మోసం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement