రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు! | Ponguleti Sudhakar Reddy takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు!

Jun 6 2015 1:44 PM | Updated on Sep 3 2017 3:19 AM

రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు!

రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు!

రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిని ఏ1 ముద్దాయిగా చేర్చాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్: రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిని ఏ1 ముద్దాయిగా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి కేసు విచారణ నత్తనడకన సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కేసును వేగవంతం చేయాలని సుధాకర్రెడ్డి... ప్రభుత్వానికి సూచించారు. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జోక్యం చేసుకోవాలని పొంగులేటి కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement