జమ్ముకాశ్మీర్లో యుద్ధవాతావరణం నెలకొంది.
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లో యుద్ధవాతావరణం నెలకొంది. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరసగా దాడికి పాల్పడుతోంది.
ఆదివారం రాజౌళి జిల్లాలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. శనివారం పూంచ్ జిల్లా సరిహద్దుల్లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. పాక్ బలగాలు సరిహద్దు వద్ద భారత్ బలగాలనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో భారత్.. పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బసీద్కు సమన్లు జారీ చేసింది.