పాకిస్తాన్ బలగాలు చేపట్టిన ఆర్మీ ఆపరేషన్ లో ముగ్గురు మిలిటెంట్లు మృతిచెందారు.
ఇస్లామాబాద్:పాకిస్తాన్ బలగాలు చేపట్టిన ఆర్మీ ఆపరేషన్ లో ముగ్గురు తాలిబన్ మిలిటెంట్లు మృతిచెందారు. శనివారం పాకిస్తాన్ రక్షణ కమిటీ సభ్యుడు ఆయూబ్ ఖాన్ ఇంటిపై దాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ ఆపరేషన్ చేపట్టింది. నిన్నటి కాల్పులు అయూబ్ ఖాన్ మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా స్వాత్ జిల్లాలోని ఛార్ బగ్ ప్రాంతంలో ఆదివారం పాకిస్తాన్ బలగాలు మిలిటెంట్ల స్థావరాలపై దాడి చేయడంతో ముగ్గురు మిలిటెంట్లు మృత్యువాత పడ్డారు.
పాకిస్తాన్ దేశపు స్విట్జర్లాండ్ గా పేరున్న ఈ ప్రాంతంలో తాలిబన్లు రెండు సంవత్సరాల పాటు తిష్టవేసిన అనంతరం అక్కడి నుంచి పొరుగుదేశం ఆఫ్ఘానిస్తాన్ కు తరలిపోయారు. 2009 జూలై నుంచి పాకిస్తాన్ నియంత్రణలోకి వచ్చిన స్వాత్ లో తిరిగి తాలిబన్లు దాడులకు తెగబడటంతో పాకిస్తాన్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. గత సంవత్సరం యూఎస్ ద్రోన్ దాడుల్లో అప్పటి తాలిబన్ నాయకుడు హకిముల్లా మెహసూద్ మృతి చెందడంతో ఆ స్థానంలో ముల్లాహ్ ఫజుల్లా బాధ్యతలు స్వీకరించాడు.