మరోసారి నిర్మాణంలో భవనం గోడ కూలింది.
భవనం గోడ కూలి విద్యార్థి మృతి: 15 మందికి గాయాలు
Published Thu, Oct 16 2014 3:21 PM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM
ఢిల్లీ: మరోసారి నిర్మాణంలో భవనం గోడ కూలింది. ఢిల్లీలోని నోయిడా ప్రాంతంలోని ఒక భవనం నిర్మాణ పనులు జరుగుతుండగా గోడ ఆకస్మాత్తుగా కూలిన ఘటన గురువారం కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందగా, మరో 15 మందికి గాయాలైయ్యాయి. ప్రస్తుతం గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
భవనం గోడ కూలిన ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యజమానికి అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement