బసవతారకం ఆస్పత్రిలో నర్సు అనుమానాస్పద మృతి | nurse mysterious death in basavatarakam cancer hospital | Sakshi
Sakshi News home page

బసవతారకం ఆస్పత్రిలో నర్సు అనుమానాస్పద మృతి

Jun 16 2017 5:13 PM | Updated on Sep 5 2017 1:47 PM

బసవతారకం ఆస్పత్రిలో నర్సు అనుమానాస్పద మృతి

బసవతారకం ఆస్పత్రిలో నర్సు అనుమానాస్పద మృతి

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చైర్మన్‌గా ఉన్న బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో నర్సు అనుమానాస్పద మృతి కలకలం రేపింది.

హైదరాబాద్‌: ప్రఖ్యాత బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో నర్సు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో ఉన్న ఈ ఆస్పత్రిలో నర్సుగా పనిస్తోన్న శ్రావణి(21) శుక్రవారం అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది.

ఆస్పత్రి వర్గాలు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసలు.. శ్రావణి చనిపోయిన ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదుచేసుకుని మృతదేహాన్ని బసవతారంలోని మార్చుకీకే తరలించారు. ప్రాథమికంగా శ్రావణిది ఆత్మహత్యేనని పోలీసులు భావిస్తున్నారు.

కాగా, శ్రావణి తల్లి కూడా ఇదే ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండటం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ బసవతారకం ఆస్పత్రికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement