ముంబై హై అలర్ట్ | Mumbai on high alert after intelligence input about terror attack | Sakshi
Sakshi News home page

ముంబై హై అలర్ట్

Jan 22 2015 4:37 PM | Updated on Aug 15 2018 7:18 PM

ముంబై హై అలర్ట్ - Sakshi

ముంబై హై అలర్ట్

ముంబై నగరంలోని సిద్ధి వినాయక ఆలయంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులు జరిపేందుకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందడంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు.

ముంబై: ముంబై నగరంలోని సిద్ధి వినాయక ఆలయంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులు జరిపేందుకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందడంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ అలయంతోపాటు దేశంలోని పలు లక్ష్యాలపై జనవరి 28వ తేదీలోగా దాడులు జరిపేందుకు పాకిస్థాన్‌కు చెందిన జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా, జైష్ ఏ మొహమ్మద్, హిజ్‌బుల్ ముజాహిద్దీన్ టైస్టు సంస్థలు భారత్‌కు నాలుగు వేర్వేరు బృందాలను పంపించాయంటూ భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో మహారాష్ట్ర పోలీసులతోపాటు ముంబై పోలీసులను అప్రమత్తం చేశాయి.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు వస్తున్న నేపథ్యంలో ఈ సమాచారంతో ఉలిక్కి పడిన భారత్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. మహారాష్ట్రలో సిద్ధి వినాయక ఆలయమే ఉగ్రవాదుల ప్రధాన టార్గెట్ అని తెల్సినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement