మాయావతితో దోస్తీకి సిద్దం: ములాయం | Mulayam Singh Yadav says ready to ally with BSP | Sakshi
Sakshi News home page

మాయావతితో దోస్తీకి సిద్దం: ములాయం

Aug 13 2014 2:22 PM | Updated on Sep 2 2017 11:50 AM

మాయావతితో దోస్తీకి సిద్దం: ములాయం

మాయావతితో దోస్తీకి సిద్దం: ములాయం

మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్వాది పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దమని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు.

న్యూఢిల్లీ: మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్వాది పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దమని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. అయితే చిన్న మెలిక పెట్టారు. ఇందుకు ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ చొరవ తీసుకోవాలని అన్నారు. ' ఈ విషయంలో లాలూ చొరవ తీసుకుంటే, బీఎస్పీతో చేతులు కలిపేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు' అని ములాయం అన్నారు.

ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి వ్యతిరేకంగా బీఎస్పీ, ఎస్పీ కలిసి పనిచేయాలని లాలూ చేసిన సూచన గురించి అడిగినప్పుడు ములాయం ఈ విధంగా స్పందించారు. 23 ఏళ్ల విరామం తర్వాత బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, జేడీ(యూ) నాయకుడు నితీష్ కుమార్ మళ్లీ ఒక్కటయ్యారు. ఇదే తరహాలో బీఎస్పీ, ఎస్పీ కలిసిపోవాలని  ఆయన సూచించారు.

1993లో యూపీలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఈ కూటమి ఓడిపోవడంతో బీఎస్సీతో కలిసి పోటీ చేసి తప్పుచేశామని అప్పట్లో ములాయం సింగ్ వ్యాఖ్యానించారు. ఏనుగు గుర్తు ఉన్న బీఎస్సీతో సైకిల్ గుర్తు ఉన్న సమాజ్వాదీ పార్టీకి మళ్లీ జట్టు కుదురుతుందో, లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement