బంగారంలాంటి భూములు లాక్కునేందుకే... | modi governement trying to accupy formers land: sonia gandhi | Sakshi
Sakshi News home page

బంగారంలాంటి భూములు లాక్కునేందుకే...

Apr 19 2015 1:28 PM | Updated on Mar 18 2019 9:02 PM

బంగారంలాంటి భూములు లాక్కునేందుకే... - Sakshi

బంగారంలాంటి భూములు లాక్కునేందుకే...

బంగారంలాంటి పంటలు లాక్కోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు.

న్యూఢిల్లీ: బంగారంలాంటి పంటలు లాక్కోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. ఆదివారం రైతులకోసం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన కిసాన్ ర్యాలీలో పాల్గొన్న సోనియా మాట్లాడుతూ బడ్జెట్లో రైతుల సంక్షేమానికి కేటాయింపులు తగ్గాయని చెప్పారు. ఓ పథకం ప్రకారమే మోదీ సర్కార్ భూ సేకరణ చట్టంలో మార్పులు తెస్తున్నారని, రైతుల భూములు లాక్కోవాలన్నదే బీజేపీ మోదీ ప్లాన్ అని ఆరోపించారు.

కార్పొరేట్ సంస్థలకు మేలు చేయాలన్నదే మోదీ ప్రధాని ఉద్దేశమనిఆమె చెప్పారు. 14 పార్టీలతో కలిసి తాము ఈ విషయంలో రాష్ట్రపతిని కలిశామని చెప్పారు. మోదీ చెప్పే మాట ఒకటి.. మనసులో ఉన్నది మరొకటి అని తెలిపారు. కిసాన్ ర్యాలీతో రైతుల ఆగ్రహాన్ని మోదీ దృష్టికి తీసుకొచ్చామని సోనియా వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement