ప్రముఖ దేశీ హ్యాండ్‌సెట్ తయారీ కంపెనీ కార్బన్, మొబైల్ ఉపకరణాల వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
రూ.100 కోట్ల ఆదాయంపై కన్ను
హైదరాబాద్: ప్రముఖ దేశీ హ్యాండ్‌సెట్ తయారీ కంపెనీ కార్బన్, మొబైల్ ఉపకరణాల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 5,000 ఎంఏహెచ్, 7,000 ఎంఏహెచ్, 10,000 ఎంఏహెచ్ వేరియంట్లలో పవర్ బ్యాంక్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.999 నుంచి ప్రారంభ ధర కలిగిన ఇవి స్నాప్‌డీల్‌లో లభిస్తున్నాయి. కార్బన్ మొబైళ్ల కోసం ‘ఆల్ట్రా క్లియర్’ బ్రాండ్ పేరుతో స్క్రీన్ గార్డులను కూడా మార్కెట్‌లోకితెచ్చింది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొబైల్ పరికరాల విభాగంలో రూ.100 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుందని కార్బన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శశిన్ దేవ్‌సరి తెలిపారు.