Sakshi News home page

'ఎంఎస్‌ ధోనీ'కి అనుకోని చిక్కులు!

Published Mon, Aug 22 2016 7:28 PM

'ఎంఎస్‌ ధోనీ'కి అనుకోని చిక్కులు! - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ'. ఈ సినిమాకు మహారాష్ట్రలో అనుకోని చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ చిత్రాన్ని మరాఠీలోకి డబ్ చేయవద్దంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) సినీ వ్యవహారాల విభాగం తాజాగా హెచ్చరికలు జారీచేసింది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ధోనీకి దేశమంతా అభిమానులు ఉన్నారు. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన అతని జీవిత కథ యువతకు స్ఫూర్తిదాయకం. అందుకే ఈ సినిమాను దేశంలోని అన్ని భాషల్లో డబ్‌ చేయాలని నిర్ణయించినట్టు చిత్ర దర్శకుడు నీరజ్ పాండే తెలిపారు.

అయితే  ఎమ్మెన్నెస్ చిత్రవిభాగమైన చిత్రపత్ కర్మాచారి సేన (సీకేఎస్) ఈ ఆలోచనను వ్యతిరేకిస్తుంది. ఈ సినిమాను ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తే.. ప్రాంతీయ భాషా సినిమాల మార్కెట్‌ను ఇది దెబ్బతీసే అవకాశముందని సీకేఎస్‌ పేర్కొంటున్నది. 'ధోనీ' సినిమాను మరాఠీలో డబ్‌ చేస్తే.. అది మరిన్ని హిందీ సినిమాలు మరాఠీలో డబ్‌ చేసే ట్రేండ్‌కు దారితీయవచ్చునని, దాంతో స్థానిక మరాఠీ సినిమాలకు అన్యాయం జరుగుతుందని సీకేఎస్ వాదిస్తోంది. 'ధోనీ'ని మరాఠీలో డబ్ చేయాలన్న ఆలోచనను తాము వ్యతిరేకిస్తున్నట్టు సీకేఎస్‌ పేర్కొన్నది.

Advertisement
Advertisement