అక్కాబావలను ఇరికించాలని.. బాంబు పెట్టాడు! | man arrested for planting bomb to frame up sister, brother in law | Sakshi
Sakshi News home page

అక్కాబావలను ఇరికించాలని.. బాంబు పెట్టాడు!

Jan 17 2015 6:10 PM | Updated on Oct 9 2018 5:39 PM

అక్కాబావలను ఇరికించాలని.. బాంబు పెట్టాడు! - Sakshi

అక్కాబావలను ఇరికించాలని.. బాంబు పెట్టాడు!

ఆస్తి వివాదంలో అక్కా బావలను ఇరికించాలనుకున్న ఓ యువకుడు.. ఏకంగా రైల్లో బాంబు పెట్టాడు!

ఆస్తి వివాదంలో అక్కా బావలను ఇరికించాలనుకున్న ఓ వ్యక్తి.. ఏకంగా రైల్లో బాంబు పెట్టాడు! చివరకు రైల్వే పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్ ప్రాంతంలో జరిగింది. వినీత్కుమార్ (55) బీహార్లోని గయ జిల్లా బేల్దారి తోలా గ్రామానికి చెందినవాడు. ప్రవీణ్ అవస్థి అనే మారుపేరుతో అతడు జబల్పూర్లో నివసిస్తున్నాడు. అదే పేరుతో ఓటరు కార్డు కూడా తీసుకున్నాడు. పాట్నాలో అతడి బావను ప్రశ్నించిన తర్వాత పోలీసులు వినీత్ కుమార్ను అరెస్టు చేశారు.

అతడు ఇంతకుముందు బీహార్ గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేస్తూ.. రూ. 48 లక్షల అక్రమాలకు పాల్పడి అరెస్టయ్యాడు. మూడు నెలలు జైల్లో ఉండి, తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు. తన మొత్తం ఆస్తిని తన బావ వినయ్ కుమార్ సింగ్, అక్క కమలాకుమారి లాగేసుకుని తనను తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపించాడు. వాళ్లమీద పగ తీర్చుకోవడం కోసం గోండ్వానా ఎక్స్ప్రెస్లోని ఓ స్లీపర్ కోచ్లో బాంబు పెట్టాడు. దాంతోపాటు తన అక్కా బావలకు సంబంధించిన కొన్ని పత్రాలు కూడా ఉంచాడు. పోలీసులు దాన్ని చూసి తొలుత అతడి బావను విచారించగా అసలు విషయం తెలిసి.. వినీత్ను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement