బార్ ఓపెన్ చేసిన మంత్రులు! | Maharashtra ministers inaugurate liqour bar! | Sakshi
Sakshi News home page

బార్ ఓపెన్ చేసిన మంత్రులు!

May 11 2015 9:38 PM | Updated on Jul 18 2019 2:26 PM

బార్ ఓపెన్ చేసిన మంత్రులు! - Sakshi

బార్ ఓపెన్ చేసిన మంత్రులు!

మహారాష్ట్ర మంత్రులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు చెడ్డపేరు తీసుకొచ్చారు.

ముంబయి: మహారాష్ట్ర మంత్రులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు చెడ్డపేరు తీసుకొచ్చారు. ఆయన కేబినెట్లో బాధ్యతలు నిర్వహిస్తూ అహ్మద్ నగర్లో ఓ బారు షాపును ఓపెన్ చేశారు. దీంతో అది ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు తావునిచ్చింది. హోంశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న రామ్ షిండే, ఆర్థిక శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న దీపక్ కేసర్కార్ అహ్మద్ నగర్లో ఓ బారు షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేశారు.

గతంలో తమ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మధ్య పాన నిషేధానికి కట్టుబడి ఉన్నామని, దఫాలవారిగా ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధమని కేబినెట్ సమేతంగా ఫడ్నవీస్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మంత్రులు చేసిన చర్యలు పలు విమర్శలకు తావిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement