పలు గ్రామాలను అనుసంధానించే వంతెనను బాంబులతో కూల్చివేసేందుకు నక్సల్స్ పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు.
ఔరంగాబాద్: పలు గ్రామాలను అనుసంధానించే వంతెనను బాంబులతో కూల్చివేసేందుకు నక్సల్స్ పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లా కెతాకీ సమీపంలోని వంతెన కింద పేలడానికి సిద్ధంగా ఉన్న శక్తిమంతమైన బాంబును పోలీసులు గుర్తించారు.
వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ను రంగంలోకి దించి బాంబును నిర్వీర్యం చేశారు. 'ఇది కచ్చితంగా నకల్స్ పనే' అని స్థానికల పోలీసు అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కెతాకీ సమీపంలోని అన్ని వంతెనలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.