విమానం హైజాక్ కథ సుఖాంతం | Libyan plane with 118 on board hijacked, lands in Malta: Reports | Sakshi
Sakshi News home page

విమానం హైజాక్ కథ సుఖాంతం

Dec 23 2016 5:22 PM | Updated on Sep 4 2017 11:26 PM

విమానం హైజాక్ కథ సుఖాంతం

విమానం హైజాక్ కథ సుఖాంతం

లిబియా అంతర్గత విమానం విమానాన్ని ఇద్దరు దుండగులు హైజాక్ చేశారు. లిబియా ప్రభుత్వ రంగ సంస్థ ఆఫ్రికియా ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ బస్ 320 అనే విమానాన్ని శుక్రవారం హైజాక్ చేశారు.

 లిబియా విమానం హైజాక్ ఉదంతం సుఖాంతమైంది.   విమానంలోని 111 మంది ప్రయాణీకులతో పాటు సిబ్బందినికూడా హైజాకర్లు  విడిచిపెట్టారు. తొలుత బందీల్లో మహిళలను, చిన్నారులను వదిలిట్టిన హైజాకర్లు చివరికి   ప్రభుత్వానికి లొంగిపోయారు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
 లిబియా  ప్రభుత్వ రంగ సంస్థ ఆఫ్రికియా ఎయిర్  వేస్ కు చెందిన  ఎయిర్ బస్ 320 అనే విమానాన్ని శుక్రవారం  హైజాక్ చేశారు. మొత్తం111మంది  ప్రయాణికులు ఏడుగురు సిబ్బందితో బయలుదేరిన విమానాన్ని  దారి మళ్లించారు.   విమానాన్ని పేల్చివేస్తామని  బెదిరించారు. దీంతో మాల్టీస్ ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్  రంగంలోకి దిగి లిబియా ప్రధాని ఫయీజ్ అల్ సెర్రాజ్‌తో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు. భద్రతా దళాలు రక్షణ మరియు  అత్యవసర చర్యల్ని చేపట్టి, హైజాకర్లతో  మంతనాలు జరిపారు.   నైరుతీ లిబియా  సబా నుంచి  ట్రిపోలీ  వెళుతుంగా హైజాకర్లు  దాళి మళ్లించారు.  దీంతో మాల్టా ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్  ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  కొన్ని విమానాలను రద్దుచేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement