ఆధిపత్య దోపిడీ కోసమే.. : ఎం.కోదండరాం | Kodandaram alleged on seemandhra | Sakshi
Sakshi News home page

ఆధిపత్య దోపిడీ కోసమే.. : ఎం.కోదండరాం

Sep 25 2013 2:53 AM | Updated on Apr 7 2019 3:47 PM

ఆధిపత్య దోపిడీ కోసమే.. : ఎం.కోదండరాం - Sakshi

ఆధిపత్య దోపిడీ కోసమే.. : ఎం.కోదండరాం

సమైక్యవాదం పేరుతో కొంతమంది అధికారాన్ని దక్కించుకోవడానికి కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ఆరోపించారు.

సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: సమైక్యవాదం పేరుతో కొంతమంది అధికారాన్ని దక్కించుకోవడానికి కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ఆరోపించారు. సమైక్యవాదం ఆధిపత్య దోపిడీ కోసమైతే తెలంగాణది జీవన పోరాటమన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో, మెదక్‌జిల్లా సంగారెడ్డిలో జరిగిన విద్యార్థి భేరి సభలో మాట్లా డారు. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం కాబట్టి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం ఎవరి వల్లా కాదన్నారు. హైదరాబాద్  తమది అని సీమాంధ్రులు అంటే.. హైదరాబాదే నవ్వుతుందని ఎద్దేవా చేశారు. కేవలం హైదరాబాద్‌లో కోటలు కట్టుకున్నవారు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు సంబరాలు మాని, తెలంగాణ కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని కోరారు.  ఈ నెల 29న హైదరాబాద్‌లో సకలజనభేరి సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సులో ఎమ్మెల్యే హరీష్‌రావు, లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ , నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 నేడు టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం
 ఈ నెల 29న నిర్వహించనున్న సకలజనుల భేరిసభ నిర్వహణపై చర్చించేందుకు బుధవారం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది.  మంగళవారం టీఎన్జీవో భవన్‌లో  పలువురు నేతలు సమావేశమై సభకు జన సమీకరణ, నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement