
నేను వందశాతం హిందువునే: ముఖ్యమంత్రి
నేను కూడా హిందువునే. నా పేరు ఏమిటి.. నేను వందశాతం హిందువుని..
మైసూరు: 'నేను కూడా హిందువునే. నా పేరు ఏమిటి. సిద్ద-రామ.. నేను వందశాతం హిందువుని' అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలో బీజేపీ హిందూత్వ అజెండాను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన మండిపడ్డారు. దక్షిణ కన్నడలో మత ఉద్రిక్తతలను ప్రస్తావించిన ఆయన.. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతోనే ఓటర్లను విభజించేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
తాను హిందువునే అయినా బీజేపీ తరహాలో ప్రజలను విభజించేందుకు ప్రయత్నించడం లేదని అన్నారు. మతం పేరిట ఓటర్లను సమీకరించి ఉత్తరప్రదేశ్ తరహాలో కర్ణాటకలోనూ విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, రాష్ట్రంలో దానిని జరగనివ్వబోమని ఆయన పేర్కొన్నారు.