టీఎసీఎస్ కు కొత్త చైర్మన్ | Ishaat Hussain To Replace Cyrus Mistry As TCS Chairman | Sakshi
Sakshi News home page

టీఎసీఎస్ కు కొత్త చైర్మన్

Nov 10 2016 8:56 AM | Updated on Sep 4 2017 7:44 PM

టీఎసీఎస్ కు కొత్త చైర్మన్

టీఎసీఎస్ కు కొత్త చైర్మన్

సైరస్ మిస్త్రీ స్ధానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చైర్మన్ గా ఇషాత్ హుస్సేన్ ను నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ముంబై: సైరస్ మిస్త్రీ స్ధానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చైర్మన్ గా ఇషాత్ హుస్సేన్ ను నియమిస్తున్నట్లు  కంపెనీ ప్రకటించింది. కొద్ది రోజులుగా టాటా గ్రూప్ సన్స్ తో మిస్త్రీ వివాదం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీసీఎస్ చైర్మన్ గా ఇషాత్ హుస్సేన్ పగ్గాలు చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది. 

గురువారం నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు బాంబే స్టాక్ ఎక్చేంజ్ కు వెల్లడించింది. ఇషాత్ హుస్సేన్ ను టీసీఎస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ గా ఎంపిక చేస్తున్నట్లు టాటా సన్స్ నుంచి లేఖ అందినట్లు చెప్పింది. కొత్త చైర్మన్ ను నియమించే వరకూ ఇషాత్ హుస్సేన్ ఆ బాధ్యతలను నిర్వర్తిస్తారని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement