47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
అట్టహాసంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్
Nov 20 2016 7:29 PM | Updated on Sep 4 2017 8:38 PM
గోవా: 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని సత్కరించారు. స్వచ్ఛ తన్, మన్, ధన్ లు ప్రభుత్వ నినాదాలని చెప్పారు.
ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని తెలిపారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం దేశంలోని నల్లధన కుబేరులకు నిద్ర పట్టడం లేదని అన్నారు.
Advertisement
Advertisement