బొగ్గు రవాణా చార్జీల మోత! | Sakshi
Sakshi News home page

బొగ్గు రవాణా చార్జీల మోత!

Published Tue, Aug 23 2016 2:37 PM

బొగ్గు రవాణా చార్జీల మోత!

ముంబై:  రైల్వే ఆదాయాలను పెంచుకునే లక్ష్యంతో  బొగ్గు రవాణా చార్జీలను రైల్వే బోర్డ్ సవరించింది.  ఇంధన ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యంలో   ఈ నిర్ణయం తీసుకుంది.  భారతీయ రేల్వే బొగ్గు రవాణా  చార్జీలను  పెంచింది. 19శాతం చార్జీలను పెంచుతున్నట్టు మంగళవారం వెల్లడించింది.   కేవలం బొగ్గు రవాణా పై మాత్రమే 19 శాతం వరకు చార్జీలను పెంచుతున్నట్టు రైల్వే బోర్డ్ సభ్యులు వివరణ  ఇచ్చారు.  100 కి.మీ  పరిధిలోపు  ఎలాంటి పెంపులేదని., 200-700 మధ్య 8-14 శాతం,  700  కి.మీ పైన మరింత పెంపు ఉండనుందని స్పష్టం చేసింది.

దీని ప్రభావం సిమెంట్ , పవర్ కంపెనీలపై పడనుందని ఎనలిస్టులు  అభిప్రాయపడ్డారు.  మరోవైపు మార్కెట్లో  స్టీల్, సిమెంట్  రంగాలు నష్టాలను చవిచూశాయి.  ముఖ్యంగా సిమెంట్ దిగ్గజం,అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ఏసీసీ, స్టీల్ రంగంలో జెఎస్డబ్ల్యు స్టీల్ లిమిటెడ్  నష్టపోయాయి.

 

Advertisement
Advertisement