బ్యాంకులకు వరుస సెలవులు | IBA asks customers to complete urgent bank transactions today, citing three-day holiday ahead | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు వరుస సెలవులు

Mar 10 2017 2:25 PM | Updated on Sep 5 2017 5:44 AM

బ్యాంకులకు వరుస సెలవులు

బ్యాంకులకు వరుస సెలవులు

వరుస సెలవులు వస్తున్నందున బ్యాంకు వినియోగదారులు తమ పనులను సత్వరమే పూర్తి చేసుకోవాలని ఇండియన్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ కోరింది.

ముంబై: వరుస సెలవులు వస్తున్నందున బ్యాంకు వినియోగదారులు తమ పనులను సత్వరమే పూర్తి చేసుకోవాలని ఇండియన్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ కోరింది. శని, ఆది, సోమ వారాల్లో బ్యాంకులు పనిచేయవు కాబట్టి శుక్రవారమే ముఖ్యమైన బ్యాంకు పనులేవైనా ఉంటే పూర్తి చేసుకోవాలని సూచించింది. 11న రెండో శనివారం, 12న ఆదివారం, 13వ తేదీ హోలీ పండుగ సెలవులు ఉన్నందున ఈ జాగ్రత్త తీసుకోవాలని కోరింది.

మరోవైపు ఏటీఎంల్లో డబ్బులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంలకు వెళితే నో క్యాష్‌ అని బోర్డు దర్శనం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులకు వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా బ్యాంకులకు వరుస సెలవులు రానుండటంతో మళ్లీ కరెన్సీ కోసం జనాలు ముందునుంచే ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement