‘ఎందుకు తప్పించారో తెలియదు’ | I don't know what is the reason for my removal as spokesperson: Jay Panda | Sakshi
Sakshi News home page

‘ఎందుకు తప్పించారో తెలియదు’

May 13 2017 1:51 PM | Updated on Sep 5 2017 11:05 AM

‘ఎందుకు తప్పించారో తెలియదు’

‘ఎందుకు తప్పించారో తెలియదు’

బీజేడీ పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఎందుకు తొలగించారో తనకు తెలియదని ఆ పార్టీ ఎంపీ బైజయంత్‌ పాండా తెలిపారు.

భువనేశ్వర్‌: బిజూ జనతాదళ్‌(బీజేడీ) పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఎందుకు తొలగించారో తనకు తెలియదని ఆ పార్టీ ఎంపీ బైజయంత్‌ పాండా తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవిస్తానని అన్నారు. అధికార ప్రతినిధి పదవి నుంచి పాండాను శుక్రవారం ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ తొలగించారు.

పార్టీని ఇబ్బంది పెట్టేవిధంగా పత్రికల్లో ఆయన రాసిన వ్యాసాలు రాసినందుకు, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆయనపై చర్య తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ నాయకుల్లో కొంత మంది బీజేపీ తరపున పనిచేస్తున్నారని, పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పాండా పేర్కొనడంతో కలకలం రేగింది. దీంతో పార్టీ పదవి నుంచి పాండాను నవీన్‌ పట్నాయక్‌ తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement