మోదీ విధానాలు నచ్చే బీజేపీలో చేరా:కన్నా | i attracted narendra modi policies, kanna laxminarayana | Sakshi
Sakshi News home page

మోదీ విధానాలు నచ్చే బీజేపీలో చేరా:కన్నా

Oct 28 2014 5:34 PM | Updated on Mar 29 2019 9:24 PM

మోదీ విధానాలు నచ్చే బీజేపీలో చేరా:కన్నా - Sakshi

మోదీ విధానాలు నచ్చే బీజేపీలో చేరా:కన్నా

ప్రధాని నరేంద్ర మోదీ విధానాల నచ్చడం వల్లే బీజేపీలో చేరినట్లు మాజీ కాంగ్రెస్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విధానాల నచ్చడం వల్లే బీజేపీలో చేరినట్లు మాజీ కాంగ్రెస్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బీజేపీలో నమ్మిబంటు మాదిరిగా పనిచేస్తానన్నారు. కాంగ్రెస్ పై కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రామ్ మాధవ్ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు. తనను మోదీ విధానాలు ఆకర్షించాయన్నారు. ఆ పార్టీలో నమ్మశక్యమైన నేతగా పనిచేస్తానని కన్నా తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకుంటానని ఆయన తెలిపారు.

 

ఇంకా చాలామంది బీజేపీలో చేరే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి బీజేపీలో చేరారా?అన్న ప్రశ్నకు అటువంటిది ఏమీ లేదన్నారు.ఒకవేళ రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తే.. ఎన్నికలకు ముందే బీజేపీలో చేరి ఉండేవాడిని కదా?అని విలేకర్లను ఎదురు ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement