'వారి వల్లే పాక్ జెండాలు ఎగురుతున్నాయి' | Hoisting of Pakistani flags in J&K result of UPA's rule: BJP | Sakshi
Sakshi News home page

'వారి వల్లే పాక్ జెండాలు ఎగురుతున్నాయి'

May 29 2015 7:28 PM | Updated on Mar 23 2019 8:37 PM

జమ్మూ కాశ్మీర్లో పాకిస్థాన్ జెండాలు ఎగురు వేస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ నేత జహంగీర్ ఆరోపించారు.

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో పాకిస్థాన్ జెండాలు ఎగురు వేస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ నేత జహంగీర్ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం సరిగా పాలించకపోవడం, జమ్మూకాశ్మీర్ పై ప్రత్యేక దృష్టిని పెట్టకపోవడం వల్ల అక్కడి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు అంత తేలికగా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.

ఎవరు పాకిస్థాన్ జెండాలు ఎగురు వేస్తున్నారో వారిపై ఒత్తిడిలు తీసుకురావాలని, వారిని నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జమ్మూకాశ్మీర్లో ప్రత్యేక వాదులు ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో పాకిస్థాన్ జెండాలను కొందరు ఎగురవేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement