ట్రాఫిక్ పోలీసు ఇంట్లో.. కళ్లు చెదిరే సొమ్ము!
హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడుపుతున్నా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ బైక్ మీద వెళ్తున్నా ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆపుతారు.
హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడుపుతున్నా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ బైక్ మీద వెళ్తున్నా ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆపుతారు. మిగిలిన పేపర్లన్నింటినీ కూడా చెక్ చేస్తారు. మన కర్మకొద్దీ సరిగ్గా ఆరోజే పేపర్లు ఉండవు. నిజాయితీ గల పోలీసులైతే వెంటనే అన్ని అపరాధాలకు కలిపి చలానా రాసి కట్టమంటారు. తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాల్లో అయితే అప్పటికప్పుడే హ్యాండ్ హెల్డ్ మిషన్లతో ప్రింటవుట్ తీసి చేతికిస్తారు. కానీ, అక్కడే అవినీతిపరుడైన పోలీసు ఉంటే చేతిలో ఐదు వందలో, వెయ్యి రూపాయలో పెట్టేవరకు అక్కడినుంచి కదలనివ్వడు. లేకపోతే రెండు మూడువేలు ఫైన్ పడుతుందని బెదిరిస్తాడు.
సరిగ్గా అలాంటి అవినీతిపరుడైన ట్రాఫిక్ కానిస్టేబుల్.. కర్ణాటకలో ఏసీబీకి అడ్డంగా దొరికేశాడు. అతడి ఇంటి మీద దాడులు చేసిన ఏసీబీ అధికారులకు కళ్లు తిరిగే సంపద కనిపించింది. ఏకంగా రూ. 11.23 లక్షల నగదు, 265 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, రెండు కౌంటింగ్ మిషన్లు కూడా లభించాయి. విశ్వసనీయ సమాచారం అందడంతో కల్బుర్గి ప్రాంతంలో ఉన్న ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటి మీద ఏసీబీ దాడులు జరిపినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి.