నిరంతర విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: నిరంతర విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని గృహాలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకాన్ని ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.
క్లీన్ థర్మల్ ఎనర్జీ పథకానికి రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. 'ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన'కు రూ.14,389 కోట్లు ఇవ్వస్తామని జైట్లీ హామీయిచ్చారు.