ఆర్‌కాం హోలీ జాయ్‌ ఆఫర్స్:అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ | Get 3GB data, unlimited local and STD calls at just Rs 149 on RCom | Sakshi
Sakshi News home page

ఆర్‌కాం హోలీ జాయ్‌ ఆఫర్స్:అన్‌ లిమిటెడ్ కాల్స్‌

Mar 10 2017 2:18 PM | Updated on Sep 5 2017 5:44 AM

ఆర్‌కాం హోలీ జాయ్‌ ఆఫర్స్:అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌

ఆర్‌కాం హోలీ జాయ్‌ ఆఫర్స్:అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌

అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కూడా టారిఫ్ వార్‌ లోకి మరింతగా దూసుకొస్తోంది.

న్యూఢిల్లీ: అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కూడా టారిఫ్  వార్‌ లోకి  మరింతగా దూసుకొస్తోంది. వివిధ పథకాలతోపాటు అన్‌లిమిటెడ్‌  లోకల్‌  అండ్‌ ఎస్టీడీ కాల్స్‌ అంటూ శుక్రవారం కొత్త ప్లాన్లను ప్రకటించింది. ముఖ్యంగా 4జీ కొత్త కస్టమర్లకు రూ.49 లకు 1 జీబీ డాటాను  ఆఫర్‌ చేస్తోంది.  దీంతోపాటు రూ.149ల  రీచార్జ్‌పై 3 జీబీ డాటాతో పాటు అదనంగా తన నెట్‌వర్క్‌ లోఉచిత కాలింగ్‌ (లోకల్‌ అండ్‌ ఎస్టీడీ) సదుపాయం కల్పిస్తోంది. అలాగే 2జీ, 3 జీ ఖాతాదారుల కోసం  కొత్తప్లాన్లను ఆర్‌కాం   ప్రకటించింది.  'హోలీ జాయ్' కింద  అందుబాటులోకి తెచ్చిన  ఈ ప్లాన్లలో ఆఫర్‌ 28 రోజుల పాటు  చెల్లుబాటవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

రూ.99 అన్‌లిమిటెడ్‌ 3 జీ డేటా, రూ.49 లకే అన్‌ లిమిటెడ్‌ 2 జీ డేటాను అందిస్తోంది. 3జీ, 2జీ మార్కెట్లలో తమకు   అపారమైన సామర్థ్యం  ఉందని, అందుకే స్పెషల్‌ ఆపర్లను  అందిస్తున్నామిన ఆర్‌ కాం కో సీఈవో గురుదీప్‌  సింగ్  తెలిపారు.
ఢిల్లీ, ముంబై, కోలకతా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో కొత్త 3జీ వినియోగదారులు ఇప్పుడు రు 99 తో రీఛార్జ్ పై  అపరిమిత 3జీ డేటాతో పాటు రూ. 20 విలువ చేసే టాక్‌ టైం ఉచితం. అలాగే  ఈ ప్లాన్‌ లో ని.25 పైసల కాల్‌ చార్జ్.
హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, చెన్నై లో కొత్త 2 జి వినియోగదారులకు 28 రోజుల చెల్లుబాటుతో రూ.49ల ప్లాన్‌ లో  అపరిమిత 2జీ డేటా   రూ.20 ఇన్ బిల్ట్‌ టాక్‌ టాం, నిమిషానికి 25 పైసలు కాల్‌ చార్జ్.
ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో  ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ సభ్యులకు ఇప్పటికే రూ.303 తో రీఛార్జ్ పై 28జీబీ అందిస్తోంది. అలాగే వన్‌ ప్లప్‌ ఆఫర్‌  కింద  అదనంగా  5జీబీ అదనంగా ఆఫర్‌ చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement