స్కూళ్లలో ఇక పిజ్జా, బర్గర్లు బంద్! | FSSAI takes junk food off school menu | Sakshi
Sakshi News home page

స్కూళ్లలో ఇక పిజ్జా, బర్గర్లు బంద్!

Oct 17 2015 10:52 AM | Updated on Sep 3 2017 11:06 AM

పాఠశాల ప్రాంగణాల్లో జంక్ ఫుడ్ అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది.

న్యూఢిల్లీ: పాఠశాల ప్రాంగణాల్లో జంక్ ఫుడ్ అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. స్కూళ్లలో జంక్ ఫుడ్ అమ్మడం, అందుబాటులో ఉంచడం నియంత్రిస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ముసాయిదా మార్గదర్శకాలను జారీచేసింది. పాఠశాల విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. పాఠశాల ప్రాంగణానికి 50 మీటర్ల పరిధిలోనూ అత్యధిక కొవ్వు, సాల్ట్, షుగర్ విలువలున్న ఆహార పదార్థాలు అమ్మకుండా నియంత్రించాలని ఆదేశించింది. చిప్స్, రెడీ టు ఇట్ న్యూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, షూగర్ స్వీటెన్డ్ కార్బొనేటెడ్లు, శీతల పానీయాలు, నాన్- కార్బొనేటెడ్  డ్రింక్స్, ఆలూ ఫ్రైస్ వంటి ఆహార పదార్థాలు స్కూల్ ప్రాంగణాల్లో అమ్మకుడదని ఆదేశాలు ఇచ్చింది.

పాఠశాల ప్రాంగణాల్లో క్యాంటీన్ పాలసీని, స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ ను ఏర్పాటుచేసి.. అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల వల్ల తలెత్తే దుష్ర్పరిణామాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎఫ్ఎస్ఎస్ఐ సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement