శ్రీలంక మాజీ ప్రధాని కన్నుమూత | Former prime minister of Sri Lanka Ratnasiri Wickremanayake passes away aged 83 after brief illness | Sakshi
Sakshi News home page

శ్రీలంక మాజీ ప్రధాని కన్నుమూత

Dec 27 2016 4:50 PM | Updated on Jul 31 2018 5:31 PM

శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రం నాయకే (83) కన్నుమూశారు.

కొలంబో: శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రం నాయకే (83) కన్నుమూశారు.  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు.  1933, మే 5  జన్మించిన రత్నసిరి దేశానికి ఆయన రెండు సార్లు (2000 -2001, 2005- 2010) ప్రధానమంత్రిగా దేశానికి తన  సేవలందించారు.
కాగా 1960 లో రాజకీయాల్లోకి ప్రవేశించిన విక్రం నాయకే పీపుల్స్ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ శాసన సభ్యుడిగాఎన్నికయ్యారు.  1970 లో న్యాయ సహాయ మంత్రి నియమించారు. 1994 సార్వత్రిక ఎన్నికలలో ఎంపీ గా ఎన్నికై  హోం వ్యవహారాల మంత్రి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ నియమితులయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement